బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలంలోని కుప్కల్ గ్రామానికి చెందిన గాజబోయిన నవనీత బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న వేల్పూర్‌కు చెందిన 2006–07 ఎస్సెస్సీ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన “మిత్రమా ఫౌండేషన్” బుధవారం ఆమెకు ఆర్థిక సహాయం అందజేశారు.
బాధితురాలి స్వగ్రామం కుప్కల్లోని ఆమె నివాసానికి వెళ్లిన ఫౌండేషన్ సభ్యులు, నవనీత భర్త గాజబోయిన సురేష్ మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో రూ.82,600లను విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా మిత్రమా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, నవనీత సరైన వైద్యం పొందుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మహత్తర కార్యక్రమంలో జెల్ల రంజిత్, అంకం నరేష్, పిండి ప్రభుదాస్, శివుని సంపత్, అల్లూరి రాజ్‌కుమార్, రాజారపు బాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
