TG | ఐపీఎస్‌ అభిషేక్‌ మహంతికి ఊరట..

  • ఈనెల 24 వరకు ఉత్తర్వుల నిలిపివేత

ఐపీఎస్‌ అభిషేక్‌ మహంతికి స్వల్ప ఊరట లభించింది. ఏపీకి వెళ్లాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు సోమవారం వరకు నిలిపివేసింది. ఈ అంశంపై కేంద్రంతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది.

రాష్ట్ర విభజన సందర్భంగా కేటాయించిన ఏపీలో చేరాలని మహంతికి కేంద్రం గత నెల ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఐపీఎస్‌ అభిషేక్‌ మహంతి క్యాట్‌ను ఆశ్రయించడంతో క్యాట్‌ కేంద్ర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

దీంతో క్యాట్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ తిరుమలాదేవీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో గురువారం ఏపీలో ఐపీఎస్‌ అభిషేక్‌ మహంతి చేరాల్చి ఉండటంతో హైకోర్టు సోమవారం వరకు కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసింది.

Leave a Reply