relief 27k teachers | ఈ ఏడాదిలోనే టీచర్లకు రెండు స్పెషల్ టెట్లు

relief 27k teachers | ఈ ఏడాదిలోనే టీచర్లకు రెండు స్పెషల్ టెట్లు

relief 27k teachers | టెట్ తప్పనిసరి చేసిన సుప్రీంకోర్టు తీర్పు
ప్రమోషన్ల కోసం ఉపాధ్యాయుల ప్రయత్నాలు
విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు సిద్ధం

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల ప్రమోషన్లకు ప్రధాన అడ్డంకిగా ఉన్న సమస్యలను తొలగించే దిశగా చర్యలకు పూనుకుంది. ఈ ఉపాధ్యాయులు ప్రమోషన్‌కు అర్హత సాధించాలంటే.. తప్పకుండా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) క్వాలిఫై కావాలి. కానీ చాలా మంది టీచర్లు ఈ అర్హత సాధించక పదోన్నతులకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ వారికి శుభవార్త చెప్పింది. ఈ ఏడాది డిసెంబర్ లోపు రెండు ప్రత్యేక టెట్లను నిర్వహించాలని భావిస్తున్న విద్యాశాఖ.. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.

గతంలో 2011కంటే ముందు నియమితులైన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఉంటుందని అంద‌రూ భావించారు. కానీ, 2025లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీని ప్రకారం.. పదోన్నతులు పొందే ప్రతి ఉపాధ్యాయుడు.. టెట్ పాస్ కావడం తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో టెట్ క్వాలిఫై కాని టీచర్లు.. 31 మార్చి 2027 నాటికి టెట్ సాధించకపోతే పదోన్నతులకు అనర్హులుగా ఉంటారని నిబంధన విధించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ విద్యాశాఖ రెండో టెట్ నిర్వహించాలని భావిస్తోంది.

relief 27k teachers
relief 27k teachers

relief 27k teachers | టెట్ గ‌ట్టెక్కేందుకు య‌త్నాలు..

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు 1.02 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 57వేల మంది టెట్ అర్హత సాధించలేదు. అయితే.. గతంలో వివిధ దశల్లో విద్యాశాఖ నిర్వహించిన టెట్‌లో 30 వేల మంది టీచర్లు అర్హత సాధించారు. ఇంకా 27 వేల మంది టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది.

ప్రస్తుతం విడుదలైన టెట్ నోటిఫికేషన్ ద్వారా కొంతమంది గట్టెక్కే అవకాశం ఉన్నప్పటికీ, మిగిలిన వారందరికీ ఈ ఏడాది నిర్వహించే రెండు ప్రత్యేక టెట్లు కీలకం కానున్నాయని చెప్పవచ్చు.

ఈ నిర్ణయం వేలాది మంది ఉపాధ్యాయుల భవిష్యత్తుకు భరోసా కలిగించడమే కాకుండా, చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లకు మార్గం సుగమం చేస్తుందని విద్యా వర్గాలు భావిస్తున్నాయి. ఇక టెట్ అర్హత సాధిస్తే పదోన్నతులు పొందే అవకాశం ఉండటంతో ఉపాధ్యాయుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

click here to read more

click here to read 10 ఏళ్ల రికార్డులు బద్దలు..

Leave a Reply