WGL | రైతుల కళ్ళలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం.. యశస్విని రెడ్డి

తొర్రూరు, ఫిబ్రవరి12 (ఆంధ్రప్రభ) : రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని కర్కాల గ్రామంలో చెక్ డ్యామ్ నీటి ప్రవాహాన్ని, వెలికట్ట శివారు పెద్ద మంగ్య తండా పరిధిలోని ఎస్సారెస్పీ కాల్వలను రైతులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.

ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ… రైతుల సంక్షేమమే తమ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సాగునీటి సమస్య రాకుండా అధికారులతో మాట్లాడి బయన్న రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేయిస్తే బీఆర్ఎస్ నాయకులు తాము సాగునీరందించామ‌ని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. రైతులకు అందుబాటులో ఉండి కష్టపడేది ప్రజా ప్రభుత్వమైతే తాము చేశామని ప్రతిపక్షాలు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

సాగునీరించేందుకు అధికారులతో మాట్లాడి మైలారం రిజర్వాయర్ ద్వారా 8 చెక్ డ్యామ్ లను నింపడం జరిగిందన్నారు. పెద్ద మంగ్య తండ పరిధిలో కెనాల్ కాలువలో గత ప్రభుత్వ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మధ్యలో బండ ఉండడంతో వదిలిపోయారని, దీంతో రైతులు నష్టపోకుండా తన సొంత ఖర్చుతో బండను తొలగించి సాగునీటిని అందించామన్నారు. త‌మ ప్రభుత్వం చేసిన పనులను బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.ఇప్పటికైనా మతిభ్రమించి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి, టీపీసీసీ మాజీ సభ్యుడు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, తొర్రూర్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, కాంగ్రెస్ నాయకులు చిత్తలూరి శ్రీనివాస్ గౌడ్, అనుమాండ్ల నరేందర్ రెడ్డి, ధరావత్ సోమన్న, మాలోత్ సునీత రాజేందర్, కిషన్ యాదవ్, గౌతమ్ రెడ్డి, ప్రసాద్, ఎర్ర వెంకటరెడ్డి, వెంకన్న యాదవ్, అలువాల సోమయ్య, ఎర్ర మల్లారెడ్డి, జాటోత్ రవి నాయక్, జాటోత్ రాం లాల్, జాటోత్ సంతోష్, జాటోత్ శీను, యూత్ నాయకులు రాజేష్ యాదవ్, మహేష్ యాదవ్, ప్రవీణ్ నాయక్, పరశురాములు, రమేష్ నాయక్, హరీష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *