Telangana – బ‌డ్జెట్ స‌మావేశాల‌కు కేసీఆర్..

హైదరాబాద్ – రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. అలాగే గవర్నర్ ప్రసంగ కార్యక్రమంలోనూ పాల్గొననున్నారు.. ఈ మేరకు వివరాలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నేడు వెల్లడించారు. . అయితే అసెంబ్లీ సమావేశాలలో రేవంత్ స్థాయికి తాము చాలన్నారు. ‘ఒక లీడర్‌గా, మాజీ మంత్రిగా, కేసీఆర్ బిడ్డగా, ఆయన అభిమానిగా.. నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు ఈ చిల్లర గాళ్ళ ముందుకు రావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ వస్తారా లేదా అన్నది ఆయన వ్యక్తిగతం’ అని వెల్లడించారు.ఇది ఇలా ఉంటే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే , ఎమ్మెల్సీల‌తో రేపు కెసిఆర్ భేటి కానున్నారు. అసెంబ్లీ స‌మావేశాల‌లో పార్టీ అనుస‌రించాల్సిన వైఖ‌రిపై ఆయ‌న దిశ నిర్దేశం చేయ‌నున్నార‌.

త్వరలో ఉపఎన్నికలు..
త్వరలో తెలంగాణాలో పది ఉప ఎన్నికలు రాబోతున్నాయని సంచలన ప్రకటన చేశారు. తమకు ఈ మేరకు సమాచారం ఉందన్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామన్నారు. బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ.. సొసైటీలో తక్కువ అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో ఆర్‌ఆర్‌టాక్స్ నడుస్తోందన్న మోడీ ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిమీద మోడీకి ఎందుకు అంత ప్రేమ అని నిలదీశారు. కిషన్ రెడ్డి నిస్సహాయుడన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై తమ పార్టీ పునరాలోచనలో పడిందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *