పేకాట స్థావరాలపై దాడులు
వికారాబాద్ జిల్లాలో ఆరుగురి అరెస్ట్
వికారాబాద్ మే 26 (ఆంధ్రప్రభ): వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.కె. అన్వర్ పాషా ఆధ్వర్యంలో పరిగి పట్టణంలో పేకాట స్థావరాలపై దాడి చేశారు. పరిగి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ భవనంపై కొందరు వ్యక్తులు రహస్యంగా పేకాట ఆడుతున్నారని సమాచారం అందటంతో టాస్క్ ఫోర్స్ బృందం ఈ దాడి చేపట్టింది.
ఈ దాడిలో పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 31,450 నగదు, పేక ముక్కలు, 5 మొబైల్ ఫోన్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం వెంటనే పరిగి పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ ఎస్.కె. అన్వర్ పాషా తెలిపారు.
