పిల్లల భవిష్యత్తుపై పెరుగుతున్న ముప్పు..

పిల్లల భవిష్యత్తుపై పెరుగుతున్న ముప్పు..

  • అప్రమత్తం కావాలని హెచ్చరిక

కాళ్ళ, ఆంధ్రప్రభ : సిగరెట్, గంజా, మత్తు పదార్థాల నుండి తమ పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన కూడా ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పిలుపునిచ్చారు. కాళ్ళ మండలం పెదఅమిరం డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణంరాజు కార్యాలయంలో శుక్రవారం విలేఖలు సమావేశం నిర్వహించారు. విజయవాడలో రాఘవయ్య పార్క్ వద్ద తనను వ్యతిరేకించే కొన్ని సంఘాలు సమావేశాలు నిర్వహించి, తాను దళితులు,వెనుకబడిన వారి గృహాలు ఉద్దేశపూర్వకంగా కూల్చివేస్తున్నట్లుగా ఆరోపిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

కూల్చివేసిన ఇళ్ళని కోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చి, ప్రత్యామ్నాయ స్థలాలు చూపించిన తరువాత మాత్రమే అధికారులు వాటిని తొలగించారన్నారు.సంవత్సరం క్రితం నియోజకవర్గంలో వింత జ్వరం బారిన ప్రజలు పడుతుండడం దానికి కారణం తెలుసుకోగా తాగునీరు కలుషితం అవ్వడమే ప్రధాన కారణంగా గుర్తించినట్లుగా చెప్పారు. వంటకాలువ పక్కన గృహాలు ఉండడం వల్ల ఆ నీరు త్రాగునీరుకు సరఫరా అయ్యే చెరువుల్లోకి చేరి ప్రజల వ్యాధుల బారిన పడుతున్నారని, ఆ కారణంగానే ప్రత్యామ్న్యాయం చూపించిన తర్వాత మాత్రమే ఇల్లు తొలగించడం జరిగిందని తెలిపారు.

నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మైక్రో ఫిల్టర్ లో ఏర్పాటుచేసి త్రాగునీరుకి ఇబ్బందులు లేకుండా చేశామని, వాటి గురించి ఎవరు మాట్లాడకపోవడం దారుణం అన్నారు. ఉద్దేశపూర్వకంగానే విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలుగువీర లేవరా స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిపై ఖచ్చితంగా అధికారుల స్పందించి చర్యలు చేపట్టాలని, అలా అడగడం ప్రజల యొక్క హక్కుని తెలిపారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడనికి మైకులు తొలగించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

అదేవిధంగా స్కూలుకు 90 మీటర్ల దూరంలో సిగరెట్, మత్తు పదార్థాల షాపులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్వయంగా ఆదేశించానన్నారు. పిల్లల ఆరోగ్యాన్ని రక్షించడం కూడా తల్లితండ్రుల బాధ్యతని, ఏమాత్రం అనుమానం వచ్చిన సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇదే విషయంపై డీజీపీకి తెలుగువీర లేవరా సంస్థ తరఫున లేఖ రాయడం జరిగిందని, రాష్ట్రవ్యాప్తంగా 90 మీటర్ల దూరంలో ఎటువంటి సిగరెట్లు వంటి మాదక ద్రవ్యాలు అమ్మకూడదని వాటిని అరికట్టాలని కోరినట్టుగా తెలిపారు.