ఏసీబీకి చిక్కిన వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్..

మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ మహమూద్ శనివారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు.

స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మహమూద్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

సప్లిమెంటరీ నివేదికను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ)కు పంపేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో మహమూద్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని మందులవారి కాలనీలో ఉన్న మహమూద్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply