ధాన్యం కొనుగోలు చేయాలని బిఆర్ఎస్ నిరసన..
ఆలేరు, ఆంధ్రప్రభ : రైతుల నుండి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఇబ్బందులను నివారించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆలేరు – సిద్దిపేట రహదారిపై నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. కొనుగోలు ప్రక్రియలో, ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి తరలింపులో జరుగుతున్న ఇబ్బందులను సరిదిద్దవలసిన బాధ్యతను నిర్వర్తించలేక ప్రభుత్వం తన అసమర్ధతను ప్రదర్శిస్తున్నదని ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు అన్నారు. రోడ్డుపై దాన్యం బస్తాలను ఉంచి నిరసన తెలిపారు. మండల బిఆర్ఎస్ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, మామిడాల భానుచందర్ తో పాటు, గ్రామ శాఖ బాధ్యులు, ముఖ్య నాయకులు, రైతులు పాల్గొన్నారు.
