మక్కల త‌ర‌లింపు

బారులు తీరిన ట్రాక్టర్లు

చిట్యాల మే 20( ఆంధ్రప్రభ): యాసంగిలో రైతులు పండించిన మక్కలు మండల కేంద్రంలోని పిఎసిఎస్ గోదాం ఆవరణలో బుధవారం దిగుమతి కోసం ట్రాక్టర్లు బారులు తీరాయి. యాసంగిలో రైతులు పండించిన మొక్కజొన్నలు, చిట్యాల మండలం తో పాటు చుట్టుపక్కల మండలాలు టేకుమట్ల, మొగుళ్లపల్లి తోపాటు మరికొన్ని మండలాల రైతులు, మార్క్ పేడ్, పిఎసిఎస్ ఆధ్వర్యంలో మక్కలు కొనుగోలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు, గోదాంలో పూర్తిగా నిండిపోయాయి. దీంతో మండల కేంద్రంలోని పిఎసిఎస్ ఎరువుల గోదాం ఖాళీగా ఉండడంతో మక్కలను గోదాంలో నిల్వ చేసేందుకు ట్రాక్టర్ల ద్వారా రైతులు తరలివచ్చారు.

Leave a Reply