TDP | బస్సు సౌకర్యం కల్పించండి

TDP | బస్సు సౌకర్యం కల్పించండి

  • టిడిపి కార్యకర్త శ్రీధర్

TDP | కృష్ణా ప్రతినిధి ,ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు, చిన్నపులిపాక గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని టీడీపీ కార్యకర్త సూర్యదేవర శ్రీధర్ బాబు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ గతంలో రెండు వేల జనాభా కలిగిన ఈ రెండు ఊర్లకు బస్సు సౌకర్యం ఉండేదని, కొంతమేర రహదారి దెబ్బతినడం వల్ల బస్ సౌకర్యం నిలిపివేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారులు మరమ్మత్తులు చేశారని, ప్రస్తుతం బస్సు తిరగవచ్చు అని, కనుక స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా స్పందించి తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని శ్రీధర్ అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పించాక, తమ ఊరిలో ఆటోలు కూడా తిరగటం లేదని, మహిళలు, పిల్లలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కనుక ప్రభుత్వం స్పందించి తమ ఊరికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి, ఉచిత బస్సు సౌకర్యాన్ని 2000 జనాభా కలిగిన రెండు ఊర్ల గ్రామ ప్రజలు కూడా వినియోగించుకునే అవకాశం కల్పించాలని, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని శ్రీధర్ అన్నారు.

Leave a Reply