Protest | 50 రాష్ట్రాలలో నిరసన సెగలు – ట్రంప్ కు వ్యతిరేకంగా ఏకమైన అమెరికన్లు

వాషింగ్టన్ డీసీకి తరలివచ్చిన లక్షలాది జనం
కనీవిని రీతిలో కొనసాగుతున్న ఆందోళనలు
వంద రోజులలో ట్రంప్ పాలనపై తిరుగుబాటు
ట్రంప్ నిర్ణయాలతో దేశంలో ద్రవ్యోల్బణం,
నిరుద్యోగం పెరుగుతుందని ఆందోళన
అనేక దేశాల‌లో కోకోకోలా నిషేధం

వాషింగ్టన్ డిసి ‍ ‍ – జ‌న‌వ‌రి 20న అమెరికా అధ్య‌క్షుడిగా ప్ర‌మాణం స్వీకారం చేసిన డోనాల్డ్ ట్రంప్ కు అప్ప‌డే నిర‌స‌న సెగ‌లు ప్రారంభమ‌య్యాయి.. అయిన తీసుకుంటున్న నిర్ణ‌యాలు అటు అమెరికా ప్ర‌జ‌లు, ఇటు అంత‌ర్జాతీయ స‌మాజం సైతం తీవ్ర‌వ్య‌తిరేకిస్తున్నాయి.. మెకిన్ అమెరికా పేరుతో ట్రంప్ విధిస్తున్న సుంకాల‌తో అంత‌ర్జాతీయ విఫ‌ణి రంగంగా అంత‌లాకుతల‌మైపోతున్న‌ది.. ఏకంగా 50 దేశాల‌పై ట్రంప్ విధించిన సుంకాల అమ‌లు ఈ నెల తొమ్మిదో తేది నుంచి అమ‌లు కానున్నాయి.. ఇప్ప‌టికే ప‌లు దేశాలు ఆమెరికా అధ్య‌క్షుడికి సుంకాలు త‌గ్గించాల‌ని, మ‌రింత దూకుడుగా ముందుకు వెళ్ల‌వద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశాయి.. అయితే స‌సేమిరా అన‌డంతో కెనడా, గ్రీన్ లాండ్ తో స‌హ ప‌లుదేశాలు అమెరికా వ‌స్తు బ‌హిష్క‌ర‌ణ‌కు పిలుపు ఇచ్చాయి.. ఈ పిలుపు ఇచ్చిన దేశాల‌లో కోకోకోలా అమ్మ‌కాల‌ను నిలిపివేశారు.

ఇక ప్ర‌భుత్వ ఉద్యోగాలను తొలిగింపు, అనేక కార్యాల‌యాల‌లో స్టాప్ ను కుదింపు, కొన్ని కార్యాల‌యాల‌ను మూసివేయ‌డం , వీసాల‌పై ఉక్కుపాదం, బ‌ల‌వంతంగా విదేశీయుల‌ను యుద్ద విమానాల‌లో వారి వారి దేశాల‌కు త‌ర‌లించ‌డం, థ‌ర్డ్ జండ‌ర్ ను ర‌ద్దు చేయ‌డం త‌దిత‌ర అంశాలు అమెరిక‌న్ల కే న‌చ్చ‌డం లేదు. దీంతో ఈ నెల మొద‌టి వారంలో ఒక రాష్ట్రంలో నిర‌స‌న గ‌ళం ఎత్తారు.. అది క్ర‌మ క‌మ్రంగా 50 రాష్ట్రాల‌కు పాకింది.

హ్యాడ్స్ అప్ పేరుతో ఉద్యమం..

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు హ్యాడ్స్ అప్ పేరుతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.. ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 50 రాష్ట్రాలలోనూ ప్రజలు ఈ ఆందోళనలు చేస్తున్నారు.
ఇక ఆదివారం వాషింగ్ట‌న్ లో జ‌రిగిన నిర‌స‌న కార్య‌క్ర‌మం ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక కార్యక్రమం ఇదేనని అక్కడి రాజకీయ వర్గాలు తెలిపాయి. ముందుచూపు లేకుండా ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వాణిజ్య యుద్ధాలు జరుగుతాయని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ మస్క్ తీసుకున్న నిర్ణయంపైనా నిరసన వ్యక్తం చేశారు. ‘హ్యాండ్స్ ఆఫ్!’ పేరుతో దేశవ్యాప్తంగా 1,200 పైగా ప్రదేశాలలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘ట్రంప్ గో బ్యాక్’, ‘హాండ్స్ ఆఫ్ డెమోక్రసీ’, ‘మస్క్ వాస్ నాట్ ఎలెక్టెడ్’ వంటి నినాదాలతో వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, చికాగో, మయామీ వంటి నగరాల్లోని స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ అమలు చేస్తున్న వలస వ్యతిరేక విధానాలు, టారిఫ్ ల విధింపు, మస్క్ చేతిలో ప్రభుత్వ డేటా గోప్యతపై ప్రజలు తమ ఆందోళనలను కేంద్రీకరించారు. ఈ 50 రాష్ట్రాల‌లో వెల్లువెత్తుతున్న నిర‌స‌న‌ల‌ను అదుపు చేసేందుకు ట్రంప్ ప్ర‌య‌త్నిస్తున్నా కంట్రోల్ కావ‌డం లేదు.. ఇప్పటికే ప‌లు రాష్ట్రాలు ట్రంప్ నిర్ణ‌యాల‌పై కోర్టుల‌లో పిటిష‌న్ లు దాఖ‌లు చేశాయి.

Leave a Reply