అక్రమంగా మట్టి దందా

  • .. సొమ్ము చేసుకుంటున్న దళారులు
  • …. మూతపడ్డ క్వారీల నుంచి మట్టి తరలింపు
  • …ఇందిరమ్మ ఇండ్ల పేరిట అక్రమ తోలకాలు
  • చోద్యం చూస్తున్న అధికారులు
  • అనుమతులు లేకుండానే అడ్డగోలుగా తరలింపు
  • .. నంబర్‌ లేని ట్రాక్టర్‌ లతో మట్టి తరలింపు
  • … ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరు..
  • చోద్యం చూస్తున్న అధికారులు

(మహబూబాబాద్‌ జిల్లా ప్ర‌తినిధి, ఆంధ్రప్రభ)
కేసముద్రం మండలంలో కొన్ని రోజుల నుంచి పాత గ్రానైట్‌ క్వారీలను కోళ్లగొడుతూజోరుగా అక్రమ మట్టి దందా జోరుగా జరుగుతోంది. కేసముద్రం మండలం శివారు గ్రామాల్లో కోరుకొండపల్లి క్రాస్‌ రోడ్డు ఓరైస్‌ మిల్లు వెనకాల లయన్స్‌ క్లబ్‌ భవనం ఎదురుగా ఉన్న రోడ్డులోని మూత పడ్డ క్వారీ నుంచి, అదేవిధంగా ఉమ్మడి కోమటిపల్లి (సప్పిడిగుట్ట తండా) సమీపంలోని ఓ మట్టి గుట్ట నుండి గత కొన్ని రోజులుగా ఇష్టం వచ్చినట్లు- ఎటు-వంటి అనుమతులు లేకుండా మట్టి తోలకాలు జోరుగా చేస్తూ ప్రభుత్వ సొమ్మును దోచుకుంటు-న్నారు. ట్రాక్టర్లు ట్రిప్పుకు రూ. 900 లు వాసులు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అదేవిధంగా ట్రిప్పరుకు రూ.4 వేలుగా వాసులు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు, ఇతర కట్టడాలకు మట్టి అవసరం కావడంతో మట్టి దళారులకు ఆడింది.. ఆట పాడింది.. పాటగా ఈ అక్రమ మట్టి దందా అధికారులకు తెలిసి జరుగుతుందా? లేక వారు సోయి తప్పి ఉండడంతో దళారుల దందా లోనసాగు తుందా అనే విమర్శలు తలెత్తుతున్నాయి.

ప్రభుత్వ నిబంధనలు తుంగలో..
ప్రభుత్వ నిబంధల ప్రకారం మట్టి తోలకాలకు చేయొద్దు. కానీ ఇక్కడ కొంతమంది మట్టి మాఫియా ప్రభుత్వ నిబంధన‌లను తుంగలో తొక్కుతూ ప్రభుత్వ సంపదను మింగేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జేసీబీ, ప్రొక్లెయిన‌ర్‌ లాంటి యంత్రాలను దించి, ట్రిప్పర్లు, ట్రాక్టర్‌ ల ద్వారా జోరుగా మట్టిని తోలుతున్నారు. దీంతో అధికారులెవరూ.. పట్టించుకోకపోవడంతో లక్షలాది రూపాయల మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా అమ్ముకుంటున్నారు. సదరు దళారులు పట్టపగలే మట్టిని తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. సంబందించిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా తమ కండ్లముందే ట్రిప్పర్లు, ట్రాక్టర్‌ ల ద్వారా టన్నుల కొద్దీ మట్టి వెళుతున్న పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. ఫారెస్ట్‌ భూములను కరిగిస్తున్నారు. అక్రమ మట్టిదందా యథేచ్ఛగా జరుగుతోంది. అనుమతులు లేవని ఒక పక్క సంబంధించిన అధికారులు చెప్పుతున్నా, సదరు దళారులు మాత్రం ప్రకృతి సంపదను అందినకాడికిదోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారు లెవరూ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీని బట్టి చూస్తే ఈ మట్టి దందా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.మండల అధికారుల సాయంతోనే మట్టి దందా జరుగుతోందని కొన్ని విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబందించిన అధికారులు స్పందించి, అక్రమంగా తరలిస్తున్న మట్టి, భారీ యంత్రాలను, ట్రిప్పార్లను, ట్రాక్టర్‌ లను సీజ్‌ చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

నెంబర్‌ లేని ట్రాక్టర్‌ లతో మట్టి తోలకాలు…
నెంబర్‌ లేని ట్రాక్టర్‌ లతో మట్టి, ఇసుక తోలకాలు కేసముద్రం మండలంలో జోరుగా సాగుతున్న సంబంధించిన అధికార యంత్రాంగం కానీ, మోటార్ ఇన్‌స్పెక్ట‌ర్లు త‌నిఖీ చేసిన దాఖ‌లాలు లేవు. దీనికి తోడు మట్టి, ఇసుక దందా చేస్తున్న సమయంలో వాటి స్పిడు ఎవరు అందుకోలేరు. దీంతో ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరనేది ప్రశ్నర్థకంగా మారింది. ప్రమాదాలు జరిగినప్పుడే విషయం చూసుకుందాం.. అనే ధోరణి అధికారులకు ఉన్నట్లు తెలుస్తుంది. ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటే ప్రమాదల నివారణ చేసే వీలుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పటికైనా సంబందించిన అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకుని ప్రమాదలను అరిక‌ట్టాల‌ని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply