అనకాపల్లి : జిల్లా పాయకరావుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. లారీని వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు స్పాట్‌లోనే మృతి చెందగా.. మరో ఆరుగురుకి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. బంధువులకు సమాచారం అందించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని గుర్తించారు. ఈ ఘటనతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.