లారీలు రావు.. హమాలీలు దొరకరు..!

లారీలు రావు.. హమాలీలు దొరకరు..!

  • సింగిల్ విండో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన

హుస్నాబాద్, ఆంధ్రప్రభ : వడ్లు కాంట పెట్టి 15 రోజులైంది, వడ్లకు, వడ్ల బస్తాలకు చెదలు పడుతున్న ఎగుమతి చేసేందుకు లారీలు రావు.. హమాలీలు దొరకడం లేదని అధికారులు వెంటనే స్పందించి వడ్లు ఎగుమతి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని కస్తూర్బా కాలనీకి చెందిన రైతులు పట్టణంలోని సింగిల్ విండో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కస్తూర్బా కాలనీలోని ఐకెపి సెంటర్ లో కాంటా పెట్టేందుకు పది లారీలకు పైగా వడ్లు సిద్ధంగా ఉన్న పట్టించుకునే నాధుడే లేడని మండిపడ్డారు.

వడ్ల ఎగుమతి కోసం 40 కిలోల బస్తాకు నాలుగు రూపాయల చొప్పున కమిషన్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ సెంటర్ పేరుతో పట్టణంలోని గోమాత రైస్ మిల్లులో అక్రమంగా వడ్లు కాంటా పెడుతున్నారని బస్తాకు మూడు నుంచి నాలుగు కిలోల చొప్పున అదనంగా దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఆరు కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అరిగోస పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న రైతులకు సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య లారీ పంపించి లోడింగ్ చేస్తామని, వడ్ల కాంటాను ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు.

Leave a Reply