బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని కనకపూర్ గ్రామంలో ఇటీవల సీలింగ్ పెచ్చు ఊడి పడిన ఘటనలో మృతి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి అయేషా కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కోరిపెల్లి రాంకిషన్ రెడ్డి శనివారం పరామర్శించారు.

ఈ సందర్భంగా చిన్నారి తల్లి నూర్‌జా బేగంను ఓదార్చి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తూ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ కె. కృష్ణారెడ్డి, నిర్మల్ మండల పార్టీ కన్వీనర్ మహేష్ రెడ్డి, పార్టీ నాయకులు జహీర్, చిన్నపోతన్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.