సర్ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి
- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు, ఆంధ్రప్రభ : సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొజ్జ సంధ్యారెడ్డి, కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ సర్ ఇన్‌చార్జి రాచమల్ల సిద్ధేశ్వర్ పిలుపునిచ్చారు.
ఆమనగల్లు పట్టణంలోని శ్రీలక్ష్మీ గార్డెన్స్‌లో శనివారం కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్లు, సూపర్వైజర్లు, కో-ఆర్డినేటర్లు, ఇన్‌చార్జిలకు సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, కడ్తాల్, మాడుగుల, తలకొండపల్లి, వెల్దండ, కల్వకుర్తి మండలాల కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా, నిష్పక్షపాతంగా జరిగేలా బీఎల్‌ఏలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. సర్‌లో అనుసరించాల్సిన విధివిధానాలపై వారికి అవగాహన కల్పించారు. బీఎల్‌ఏలు ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించి ఓటర్ల హక్కులను పరిరక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు ఠాగూర్ బాలాజీ సింగ్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, బట్టు కిషన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కాసా శ్రీనివాస్ రెడ్డి, యాటా నరసింహ, నిట్ట నారాయణ, గుర్రం కేశవులు, జగన్, మానయ్య, శివలింగం, ఖాదర్, ఎండీ ఫరీద్, అలీం, కానుగుల దశరథం, శ్రీకాంత్, కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంగిలి ప్రసాద్, దేవరశెట్టి మహేష్, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
