సర్ సర్వేను సద్వినియోగం చేసుకోవాలి : చైర్మన్

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : సర్ ఓటర్ సవరణ సర్వే ను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడి మేత విశ్వనాథ్ రావు కోరారు. ఆయన శనివారం కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు )మండలంలోని ధనోర (బి ) పంచాయతీలో జరిగిన సర్ ఓటర్ సవరణ ఇంటింటి సర్వే కార్యక్రమంలో ధనోరా (బి) సర్పంచ్ మెస్రం స్పందన భూపతి తో కలిసి పాల్గొని ప్రజలకు ఓటర్ సవరణ నమోదు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు ఎంతో ప్రాముఖ్యత అని ప్రతి ఒక్కరు హక్కు అని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని బిఎల్ఓ ల నుండి నమోదు పత్రాలను తీసుకొని వివరాలను వెల్లడించాలని, చదువుకున్న వారైతే ఆ పత్రాలను నింపి బిఎల్ఓ లకు సకాలంలో బి ఎల్ ఓ లకు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు నాయకులు పాల్గొని ప్రజలకు సర్ సర్వే ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో ధనో ర (బి) సర్పంచ్ మెస్రం స్పందన భూపతి ప్రజలు పాల్గొన్నారు.