విద్యాలయాల అభివృద్ధే లక్ష్యం..
- రూ.5.40కోట్ల టీజీఐఐసీ సీఎస్ఆర్ నిధులు
- ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి రూ.4 కోట్లు
- తారా ప్రహరీ నిర్మాణం కోసం రూ.50లక్షలు
- గర్ల్స్ కాలేజీ ఆడిటోరియం నిర్మాణానికి రూ. 75లక్షలు మంజూరు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : విద్యాలయాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలజగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో టీజీఐఐసీ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.5.40కోట్లతో శనివారం పనుల శంకుస్థాపనకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సీఎస్ఆర్ నిధులతో ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో రూ.4కోట్లు వెచ్చించి హాస్టల్ నిర్మించనునట్టు వివరించారు. రూ. 75 లక్షలతో గర్ల్స్ జూనియర్ కాలేజీలో ఆడిటోరియం నిర్మాణం చేపట్టనుట్టు చెప్పారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డైనింగ్ హాల్, కిచెన్ నిర్మాణం కోసం రూ.75 లక్షలు వెచ్చించనునట్టు తెలిపారు.
తార డిగ్రీ కళాశాలలో ప్రహరీ నిర్మాణం కోసం ఇందులో నుంచి రూ.50లక్షలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డైనింగ్ హాల్, కిచెన్ నిర్మాణం కోసం రూ.15లక్షలు కేటాయించినట్టు నిర్మలజగ్గారెడ్డి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనితా సంతోష్, బ్లాక్ ప్రెసిడెంట్ జార్జ్ మాథ్యూస్, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కిరణ్‌గౌడ్, కౌన్సిలర్లు సంగీత మహేష్, సుష్మిత, రవినాయక్, శ్రీకాంత్ గౌడ్, ప్రీతి, కోఆప్షన్ సభ్యులు బబ్బు, శివుడు, యశోద, సోహైల్, ఆరిఫ్‌లతో పాటు ఉమెన్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అరుణ, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సునీత, తారా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.ప్రవీణ, ఎడ్యుకేషనల్ ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

