సాగునీటి సరఫరాకు కట్టుదిట్టమైన చర్యలు

సాగునీటి సరఫరాకు కట్టుదిట్టమైన చర్యలు
ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు
తిరువూరు, ఆధ్రప్రభ : సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రతి ఎకరాకు నీరు అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదట్టమైన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్థానిక సూర్య రెస్టారెంట్ సమావేశం హాల్లో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రైతంగానికి మధ్య వారదులుగా పనిచేస్తున్న సాగునీటి సంఘాల ప్రతినిధులు ఎన్ఎస్పి కాలువ మూడో జోన్ కు గోదావరి జలాలను తీసుకువచ్చే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు.
నాగార్జునసాగర్ ఎడమ కాలువ రెండు మూడు జోనులకు తాగునీరు సాగునీరు తీసుకురావడానికి ప్రాజెక్టు కమిటీ సభ్యులు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే అభినందించారు. ప్రాజెక్టు పరిధిలోని రైతులు సాగునీటి సమస్యలు కాలువల పూడికతీత పనులు చెరువుల అభివృద్ధి చేసేందుకు ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారధ్యంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పంటల సీజన్ కు ముందుగానే సాగునీటి ప్రణాళిక సిద్ధం చేసేందుకు తెలిపారు.
తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి రైతుల సంక్షేమం సాగునీటి సదుపాయాల విస్తరణ కోసం ఎల్లప్పుడూ తన వంతు కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ లు, ఆయా జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎన్ఎస్పి అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
