ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకున్న ప్రొఫెసర్ శంకర్..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ప్రధాన శాస్త్రవేత్త పెద్దపల్లి జిల్లా తేలుకుంట గ్రామ వాసి డా.మేకల శంకర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఉత్తమ ప్రతిభ శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు. నేలల ఆరోగ్య విభాగం, సహజ వనరులు, పర్యావరణ కేంద్రం రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బoగా ప్రతిష్టాత్మకమైన డా బిఆర్ అంబేద్కర్ ఉత్తమ ప్రతిభ శాస్త్రవేత్త అవార్డును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమక్షంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ మధుర స్వామినాథన్ చేతులమీదుగా డా. మేకల శంకర్ కు అందించారు. అవార్డు అందుకున్న శంకర్ కు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అభినందలు తెలిపారు. జిల్లా యువత వ్యవసాయ సాంకేతిక విద్య వైపు మొగ్గుచూపాలని విజయ రమణారావు ఆకాంక్షించారు. కాగా అవార్డు అందుకున్న డా. మేకల శంకర్ కు జిల్లాలోని పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply