కాలువల్లో గులాబీ పూలు చల్లి నిరసన వ్యక్తం చేసిన ప్రజలు

కరీమాబాద్, ఆంధ్రప్రభ : రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నాలాల్లో పేరుకుపోయిన సిల్ట్ తొలగింపు పనులను వెంటనే చేపట్టాలని వరంగల్ తూర్పు నియోజకవర్గం శివనగర్ 35వ డివిజన్ స్థానిక కంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ డిమాండ్ చేశారు.

శనివారం 35వ డివిజన్‌లో పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, డివిజన్‌లోని నాలాల పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనగా గులాబీ పువ్వులు చల్లి తమ ఆందోళనను వ్యక్తం చేశారు.

గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న స్థానిక పాలకులకు ప్రజలు పలుమార్లు సమస్యలను విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం వరంగల్ మహానగర పాలక సంస్థ పదవీకాలం ముగియడంతో నగర పాలక సంస్థ కమిషనర్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో అయినా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు.

రానున్న వర్షాకాలంలో 35వ డివిజన్ పూర్తిగా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్నందున వీలైనంత త్వరగా నాలాల సిల్ట్ తొలగింపు పనులను పూర్తి చేయాలని మేరుగు అశోక్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గడ్డం రవి, నాగుల భిక్షపతి, బజ్జూరి అంజయ్య, వెంగల్దాస్ కృష్ణ, ఉగ్గె రమేశ్, పాల సత్యం, కొత్తగట్టు శ్యామ్, జన్ను రాధ, చిదురాల సాయి, అంకతి అఖిల్, శ్రవణ్, సాయి విక్షిత్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply