ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి

రామకృష్ణాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా జయంతి వేడుకలు

టేకుమట్ల, ఆంధ్రప్రభ : తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రామకృష్ణాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గురువారం ఘనంగా నివాళులర్పించారు.

గ్రామ సర్పంచ్ నాంపెల్లి వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నాంపెల్లి వీరేశం మాట్లాడుతూ, తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజలకే చెందాలనే భావజాలంతో జీవితాంతం ఉద్యమించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. “మా వనరులు మాకే కావాలి… యాచక దశ నుంచి శాసక దశకు ఎదగాలి” అనే ఆయన సందేశం తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిందన్నారు. నేటి విద్యార్థులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుని విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నూరి స్వరూప సారయ్య, ప్రధానోపాధ్యాయులు శీను, అంగన్‌వాడీ సూపర్వైజర్ మాధవి, అంగన్‌వాడీ టీచర్ ఈర్ల పూర్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, వార్డు సభ్యుడు కుమ్మరి రవి, పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.