Private Travels Bus Accident | తృటిలో తప్పిన పెను ప్రమాదం

Private Travels Bus Accident | తృటిలో తప్పిన పెను ప్రమాదం

Private Travels Bus Accident | 48 మంది ప్రయాణికులు సురక్షితం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: తిరుపతి జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డులో ఇవాళ‌ ప్రమాదం చోటుచేసుకుంది. కలకడ నుంచి తిరుపతికి వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న పిట్టగోడను ఢీకొట్టింది.

ఘాట్ రోడ్డులో జరిగిన ఈ ఘటనతో కొద్దిసేపు ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న 48 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. బస్సు పిట్టగోడను ఢీకొట్టడంతో ఘాట్ రోడ్డులో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Private Travels Bus Accident
Private Travels Bus Accident

click here to read more

also read గోల్డ్ లోన్ కోసం వెళ్తే… గొలుసులో భాగం మాయం..!

Leave a Reply