తిరుమల శ్రీవారికి భారీ విరాళం అదింది. విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ కంపెనీలో పనిచేస్తున్న పీఎస్ రవికుమార్ దంపతులు ఆదివారం టీటీడీకి చెందిన శ్రీ ఎస్‌వీ సర్వ శ్రేయస్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.
ఈ మేరకు తిరుమల టీటీడీ అడిషనల్ ఈవో కార్యాలయంలో.. దాత డీడీని అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు జి. భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాళం అందించిన భక్తులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అభినందించారు.