Tn Cm 1st Foul : ఫస్ట్ స్ట్రోక్.. Andhra Prabha Top Story

Tn Cm 1st-Foul : ఫస్ట్ స్ట్రోక్.. Andhra Prabha Top Story
- Tn-Cm-1st-Foul : ఫస్ట్ స్ట్రోక్.. Andhra Prabha Top Story
- జ్యతిష్యుడికి ఓఎస్డీ దక్షిణ
- తమిళ అసెంబ్లీలో దుమారం
- ప్రభుత్వ నక్షం నిలదీత
- హుందాగా దళపతి స్పందన
- తక్షణేమే ఉత్తర్వులు ఉపసంహరణ
( ఆంధ్రప్రభ, చెన్నై ప్రతినిధి)

తమిళనాడు సీఎం కార్యాలయంలో పొలిటికల్ ఓఎస్‌డీగా .. సీఎం దళపతి అంతర్గత జ్యోతిష్యుడు..వీకేటీ పార్టీ అధికార ప్రతినిది రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం తాజాగా.. రాజకీయ దుమారం రేపింది. నిండు సభలో కూటమి ప్రభుత్వం శాసన సభ్యురాలు సహా.. డీఎంకే, బీజేపీ సైతం కొత్త కుర్రోడిని గధమాయించారు. అసెంబ్లీలో.. అదీ బలపరీక్ష జరుగుతున్న తరుణంలో.. ఓఎస్డీ నియామకం… తొలి సీఎం చెంప పగులగొట్టింది. అకస్మిక పరిణామంతో సీఎం దలపతి బిక్కచచ్చిపోయారు. ఇకపై ఇలాంటివి జరగవని ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చి.. మరో గంట వ్యవధిలోనే జ్యోతిష్య పండితుడికి దక్కిన ఓఎస్డీ సంభావనను సీఎం గుంజుకున్నారు. ఇదీ సరే.. ఎన్నికల్లో విజయం సాధిస్తాడని ఏడాది కిందటే సెలవిచ్చిన ఈ జ్యోతిష్యుడు.. ఈ పరాభవ నామ సంవత్సరంలో తనకు జరిగే అవమానాన్ని ఆయన జాతక చక్రం ముందుగా గుర్తించలేదా అంటూ.. సోషల్ మీడియా పండితుల సెటైర్లు వైరల్ అవుతోంది, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
Tn Cm 1st Foul ఫ అసలు ఏమి జరిగిందంటే…

తమిళనాడు తాజా ఎన్నికల్లో దళపతి విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే పార్టీ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. పాత తరం పార్టలు నీరుగారి పోయాయి. కడకు ప్రభుత్వ ఏర్పాటు చేయటానికి విజయ్ బలపరీక్షకు సిద్ధం కాక తప్పలేదు. బుధవారం విజయ్ నాయకత్వంపై ఇటు మద్దతు ఇచ్చిన పార్టీలు.. అటే వ్యతిరేక పార్టీలు చర్చలో పాల్గొన్నాయి. ముఖ్యమంత్రి విజయ్‌ను వీసీకే, డీఎండీకే, బీజేపీ తూర్పార పట్టాయి. ఈ నియామకంపై వీసీకే ఎమ్మెల్యే వన్ని అరసు తీవ్ర ఆహ్రం వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలపై శాస్త్రీయ ఆలోచనను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. “ప్రభుత్వం జ్యోతిష్యంపై కాకుండా శాస్త్రీయ ఆలోచనపై దృష్టి పెట్టాలి,” అని ఆయన విశ్వాస ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా అన్నారు. ఒక డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయకాంత్ ఈ చర్యను విమర్శిస్తూ, అధికార పదవులలో జ్యోతిష్యులను నియమించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయాన్ని బీజేపీ కూడా విమర్శిస్తూ, ప్రభుత్వం “యువతకు చెడు ఉదాహరణగా నిలవకూడదు” అని నిలదీశారు
Tn Cm 1st Fou l: దళపతి హుందాగా….

ఓఎస్డీ నియామకంపై మిత్రపక్షంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటమే కాదు, సభలో నిలదీయటంతో సీఎం విజయ్ హుందాగా స్పందించారు. ఆయన సమాధానమిస్తూ, ప్రజాస్వామ్యంలో మిత్రపక్షాల ప్రజాప్రతినిధుల గొంతుకను, మనోభావాలను తాను గౌరవిస్తానని చెప్పారు. ప్రభుత్వ నడకలో శాస్త్రీయ దృక్పథానికి లౌకిక విధానాలకే తన ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
Tn Cm 1st Foul : తక్షణ చర్య

ఈ వివాదంతో సొంత కూటమి నుంచే వ్యతిరేకత రావడంతో సీఎం విజయ్ వెంటనే వెనక్కి తగ్గారు. జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ఓఎస్‌డీగా నియమిస్తూ మే 12న జారీ చేసిన ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకుంది .
Tn Cm 1st Foul : పానం.. రాధన్ పండిట్ .

రాధన్ పండిట్ వెట్రివేల్ కేవలం జ్యోతిష్యుడే కాదు. టీవీకే (TVK) పార్టీ అధికారిక ప్రతినిధి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘనవిజయం సాధించి, ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఏడాది ముందే వెట్రివేల్ జ్యోతిష్యం చెప్పారు. ఈ అంచనా నిజమవ్వడం, అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి విజయ్‌కు అత్యంత సన్నిహిత రాజకీయ/వ్యక్తిగత సలహాదారుగా ఉండటంతో ఈ ‘రాజకీయ ఓఎస్‌డీ’ పదవిని ఇవ్వాలని విజయ్ భావించారు. గతంలో ఈ జ్యోతిష్యుడు మాజీ సీఎం జయలలితకు కూడా క్లయింట్‌గా పనిచేశారు.
also read : 144 Force Tvk : ఇక బాహుబలి Andhra Prabha Top News
