President | రష్యాపై జెలెన్‌స్కీ ఆరోపణలు

President | రష్యాపై జెలెన్‌స్కీ ఆరోపణలు

President | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి. రష్యా–ఇరాన్ సంబంధాలపై ఆయన చేసిన ఆరోపణలు యుద్ధ పరిస్థితులను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ యుద్ధంపై సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ కు రష్యా ఇంటెలిజెన్స్ సాయం చేస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ వీడియోను విడుదల చేశారు. రష్యా తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌కు రష్యా ఇలాంటి సహాయం చేయడం వెంటనే ఆపేయాలని జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు రష్యా, ఇరాన్ దేశాలు స్పందించలేదు. ఈ పరిణామాలు అంతర్జాతీయ వేదికపై మరింత చర్చకు దారితీస్తున్నాయి.

Leave a Reply