America | టెక్సాస్‌లో వ‌ర‌ద‌లు – 51 మంది మృతి

టెక్సాస్ – అమెరికాలోని టెక్సాస్ లో (Texas ) అకాల వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. వరదలతో (floods ) అక్కడి ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఈ వరద ప్రమాదంలో మరణాల సంఖ్య (death toll ) 51కి చేరింది. వేసవి శిబిరానికి వచ్చిన 15 మంది చిన్నారులు మరణించగా, మరో 27 మంది బాలికలు (girls ) గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

గత కొన్ని రోజలుగా కురుస్తున్న వర్షాలకు కెర్​ కౌంటీలో గ్వాడాలుపే నది ఉప్పొంగడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో నదీ తీరంలో ఉన్న శిక్షణాశిబిరాలను వరదనీరు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. అనేక నివాసాలు నీట మునిగి వీధుల్లోకి భారీగా వరద నీరు చేరింది. పలు వాహనాలు కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న 850 మందిని రక్షించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

మరోవైపు కెర్‌ కౌంటీలోని గ్వాడలూప్‌ నది ఉప్పొంగి సమీపంలోని మిస్టిక్‌ క్యాంప్‌ వేసవి శిక్షణా శిబిరాన్ని ముంచెత్తింది. దీంతో శిబిరంలోని 27 మంది బాలికలు గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. బాలికల సమాచారాన్ని తెలపాలంటూ వారి కుటుంబాలు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు షేర్‌ చేస్తున్నారు. మరోవైపు, బాలికల కోసం అధికారులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలిస్తున్నారు.

స్పందించిన ప్రధాని మోదీ
ఇదిలా ఉండగా వరదలతో టెక్సాస్ జనజీవన అస్తవ్యస్తం కావడంపై భారత్​ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వినాశకరమైన వరదల్లో ప్రాణనష్టం జరిగిందని, ముఖ్యంగా చిన్న పిల్లలు మరణించారని తెలిసి చాలా బాధపడ్డానని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్న అని ప్రధాని మోదీ ఎక్స్​లో పోస్ట్ చేశారు.

Leave a Reply