స్మశానవాటికలో పేకాట.. పోలీసుల దాడుల్లో ఆరుగురు పట్టివేత
రేగొండ, ఆంధ్రప్రభ: రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో తిరుమలగిరి గ్రామ శ్మశానవాటికలో కొందరు పేకాట ఆడుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో రేగొండ ఎస్సై సుధాకర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.3,010 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
గ్రామంలో ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుధాకర్ హెచ్చరించారు.
ఈ దాడుల్లో పోలీసు కానిస్టేబుళ్లు శ్రీధర్, నరేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
