ధర్మసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెసరు రమేష్
ధర్మసాగర్, ఆంధ్రప్రభ: ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాటికాయల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ పెసరు రమేష్ నియమితులయ్యారు. గురువారం ఆయన నియామకాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు.
ఈ సందర్భంగా పెసరు రమేష్ మాట్లాడుతూ.. తనపై పార్టీ అధిష్ఠానం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
తనను ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడంలో సహకరించిన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనపై విశ్వాసం ఉంచిన పార్టీ అధిష్ఠానం, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెసరు రమేష్‌కు అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో మండలంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
