కొండవీడులో జిల్లా జైలు ఏర్పాటుకు కసరత్తు..

నరసరావుపేట (యడ్లపాడు), ఆంధ్రప్రభ : యడ్లపాడు మండలంలోని కొండవీడు రెవెన్యూ పరిధిలో నూతన జిల్లా జైలు ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. జాయింట్ కలెక్టర్ సంజనా సింహా, ఆర్డీవో వి. బాలకృష్ణ ప్రతిపాదిత స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

జైలు నిర్మాణానికి భూములు అనుకూలంగా ఉన్నాయా అనే అంశంపై అధికారులు సమగ్రంగా అంచనా వేశారు. ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించారు.

మెయిన్ రోడ్డు నుంచి జైలు స్థలానికి రాకపోకలు సులభంగా ఉండేలా కొత్త రోడ్డు నిర్మాణంపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు జాయింట్ కలెక్టర్ సూచనలు జారీ చేశారు.