prasanna l గత పాలనకు గుర్తుగా ప్రజల మద్దతు…

prasanna l గత పాలనకు గుర్తుగా ప్రజల మద్దతు…

49వ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ ప్రసన్నకు బలమైన ఆశలు

prasanna l మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ: కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లక్ష్మీ ప్రసన్న ఆనంద్ కుమార్ గౌడ్ ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన ఆనంద్ కుమార్ గౌడ్ మున్సిపల్ నిధులను సమర్థవంతంగా వినియోగించి 49వ డివిజన్‌లోని కాలనీలతో పాటు పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీలు, రాజకీయాలకు అతీతంగా చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచిపోయాయి. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిన తీరు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి బలమైన అనుకూలతగా మారుతోంది.


ఈ నేపధ్యంలో లక్ష్మీ ప్రసన్న గౌడ్ చేపడుతున్న ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. గత పాలనలో జరిగిన అభివృద్ధిని కొనసాగిస్తూ, డివిజన్‌ను మరింత హైటెక్ అభివృద్ధి దిశగా తీసుకెళ్లగల సత్తా కాంగ్రెస్‌కే ఉందని ఓటర్లు విశ్వసిస్తున్నారు. ఈసారి కూడా కాంగ్రెస్‌ను గెలిపిస్తే తమ వార్డు మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందనే నమ్మకంతో ప్రజలు అభ్యర్థి గెలుపు కోరుతూ మద్దతు తెలుపుతున్నారు.