MBNR | ఆంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి..

అచ్చంపేట, ఆంధ్రప్రభ : పదర మండలం మద్దిమడుగులో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4 వరకు జరిగే పబ్బతి ఆంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశించారు.
సోమవారం అచ్చంపేట ప్రజా భవన్ క్యాంప్ కార్యాలయంలో ఆలయ అపధర్మ ధర్మకర్త, పాలకమండలి సభ్యులు, అధికారులు పాల్గొన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. భక్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై అధికారులు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని సూచించారు.
దేవస్థాన పరిసరాల్లో త్వరలోనే మొబైల్ సిగ్నల్ సౌకర్యం కోసం సెల్ టవర్ ఏర్పాటును పూర్తిచేస్తున్నామని, దీంతో భక్తులకు సమాచార వ్యవస్థ మరింత సులభంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
సమీక్ష సమావేశంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, అమ్రాబాద్ సిఐ శంకర్, దేవస్థాన ఆపధర్మ చైర్మన్ దేశవత్ రాములు నాయక్, ఈవో రంగాచార్యులు, పూజారి, పాలకమండలి డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
