జోగులాంబ ఆలయం నుంచి ప్రజాపాలన బస్సుయాత్ర

జోగులాంబ ఆలయం నుంచి ప్రజాపాలన బస్సుయాత్ర
ఇటిక్యాల, ఆంధ్రప్రభ:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజాపాలన – ప్రగతి నివేదిక బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ బస్సు యాత్ర చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. జూన్ 2న మధ్యాహ్నం 1 గంటలకు అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి యాత్ర ప్రారంభం కానుంది.
అమ్మవారి దర్శనం, వాహన పూజ అనంతరం నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి, డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ బస్సు యాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను సోమవారం ఎంపీ మల్లు రవితో కలిసి సిద్ధం చేసినట్లు సంపత్ కుమార్ చెప్పారు.
మొదటి మూడు రోజులు అలంపూర్ నియోజకవర్గంలో బస్సు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. అనంతరం మరో మూడు రోజులు గద్వాల నియోజకవర్గంలో పర్యటన ఉంటుందని వివరించారు.
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో హాజరై బస్సు యాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పిలుపునిచ్చారు.
