కమ్యూనిటీ హాల్ స్లాబ్ ప‌నులు ప్రారంభం

కమ్యూనిటీ హాల్ స్లాబ్ ప‌నులు ప్రారంభం

యాదవ కమ్యూనిటీ హాల్ స్లాబ్ ప‌నుల‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ


అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణం (Achampeta town)లో యాదవ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ స్లాబ్ ప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… “ప్రతి వర్గానికీ సామాజిక సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. యాదవ సంఘ భవనం పూర్తి కాగానే సామాజిక కార్యక్రమాలకు ఇది కేంద్రంగా మారుతుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ నిర్వహణ బాధ్యులు, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ విభాగాల చైర్మన్లు, యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply