పవర్ లిఫ్టింగ్ విజేతకు అభినందనలు

పవర్ లిఫ్టింగ్ విజేతకు అభినందనలు

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పవర్ లిఫ్టింగ్ పోటీ విజేత వివేక్ ను కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, కౌన్సిలర్లు మంగళవారం అభినందించారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కొండపల్లికి చెందిన వివేక్ విశేష ప్రతిభ కనబరిచాడు. 83 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించాడు.

ఈ విజయంతో వివేక్‌కు ‘ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ’ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. ఈ సందర్భంగా చైర్మన్ చిట్టిబాబు, కౌన్సిలర్లు వివేక్‌ను అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a Reply