AP | ఇద్దరు చిన్నారుల మృతి

AP | ఇద్దరు చిన్నారుల మృతి

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మార్కాపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు పొలం నీటి కుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయిల్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోయిలపల్లి గ్రామానికి చెందిన శశి (12), దీపన్ (10) అనే ఇద్దరు చిన్నారులు పొలం నీటి కుంటలో మునిగి మృతిచెందారు.

సమాచారం ప్రకారం, ఈ చిన్నారులు సరదాగా ఈతకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Leave a Reply