Karimnagar | హోరాహోరీ – రెండో ప్రాధాన్యత ఓట్ల తో తేలనున్న ఫలితం

కరీంనగర్ ఆంధ్రప్రభపట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం 11 వ రౌండ్ ముగిసేసేసరికి బిజెపి అభ్యర్థి అంజిరెడ్డికి 74,548 రాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 69,581 ఓట్లు రాగా బిఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 59,751 ఓట్లు రావడంతో బిజెపి 4977 ఓట్ల లీడ్ సాధించింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి మెజార్టీ రాకపోవడంతో తక్కువ వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు.

మొత్తం పట్టభద్రుల ఓట్లు 2,52,,007 పోల్ కాగా, 27,671 ఓట్లు చెల్లకుండా పోయాయి. 2,24,336 ఓట్లు చెల్లుబాటు కావడంతో అధికారులు 1,12,169 ఓట్లను గెలుపుగా నిర్ణయించారు. బుధవారం సాయంత్రం వరకు తుది ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *