నిరుపేదలకు అండగా కాంగ్రెస్ సర్కార్..
–ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్
ఉట్నూర్, ఆంధ్రప్రభ: నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉట్నూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రాసేవార్ రాధాబాయికి రూ.60,000, హీనా తబస్సుకు రూ.20,000, పర్వీన్‌కు రూ.14,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతి అర్హుడికి అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మెస్రం ఓమేష్తో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.
