జిల్లా కలెక్టర్‌ను శాలువాతో సన్మానిస్తున్న మంత్రి..

జిల్లా కలెక్టర్‌ను శాలువాతో సన్మానిస్తున్న మంత్రి..

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా పదవీబాద్యతలు చేపట్టిన కలెక్టర్ ప్రియాంక రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిని ఇవాళ మక్తల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

కలెక్టర్ మంత్రికి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు చేపట్టాల్సిన పనులపై జిల్లా కలెక్టర్ మంత్రితో చర్చించారు. తొలిసారిగా తనను కలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రియాంకను మంత్రి వాకిటి శ్రీహరి శాలువాతో ఘనంగా సత్కరించారు.

Leave a Reply