ఊట్కూర్ ప్రభావిత గ్రామపోరాట కమిటీ ఏర్పాటు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా జీవో69మక్తల్-నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఊట్కూర్ పెద్ద చెరువు సామర్థ్యాన్ని పెంచడంతో ప్రభావిత గ్రామాల సమస్యల పరిష్కారం, నష్టపరిహారంసాధన ప్రభావితగ్రామపోరాటకమిటీని ఊట్కూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం ఏర్పాటు చేసి కమిటీ ఎన్నుకున్నారు. ఊట్కూర్ ప్రభావిత గ్రామ పోరాట కమిటీ కమిటీ గౌరవ అధ్యక్షుడిగాఎం.శేషప్ప, అధ్యక్షుడిగా ఎం. భాస్కర్‌ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా గడ్డం మన్సూర్, డి. హన్మంతు, ప్రధాన కార్యదర్శిగా డి. అరవింద్ కుమార్కా ర్యదర్శులుగా కె. శివరెడ్డి , రమేష్, హన్మంతు , ఆర్. రమేష్, కన్వీనర్లుగా భరత్ కుమార్ ఆర్. నంద్ కుమార్, తోపాటు పలువురు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు బాల్ రెడ్డి, నాయకులు ఆశప్ప కొండన్ గోపాల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
