Peddi | తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Peddi | తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Peddi | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా మొదటి రోజు రూ. 135.36 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ప్రీమియర్లతో కలిపి ఇండియాలోనే రూ. 82.49 కోట్ల గ్రాస్ (రూ. 69.50 కోట్ల నెట్) రాబట్టింది. రామ్ చరణ్ కెరీర్‌లో అత్యుత్తమ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచింది. విదేశీ మార్కెట్ల నుంచి సుమారు రూ.30 కోట్ల గ్రాస్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు వసూళ్లు రూ.112.49 కోట్లకు చేరుకున్నట్లు పలు ట్రాకింగ్ సంస్థలు వెల్లడించాయి.
