11matches | ప్లే ఆఫ్స్ ఛాన్స్ సంక్లిష్టం

11matches | ప్లే ఆఫ్స్ ఛాన్స్ సంక్లిష్టం

11matches | తొలి ఏడు మ్యాచ్‌లలో ఓటమే లేదు
తర్వాత వరుసగా 4 మ్యాచ్‌ల్లో డీలా
ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే చెమ‌టోడ్చాల్సిందే..
మూడింటిలో రెండు కచ్చితంగా గెలవాలి

11matches | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 ఆరంభంలో అదరగొట్టిన‌ పంజాబ్ కింగ్స్.. గ‌త నాలుగు మ్యాచుల్లో ఓడిపోయి ప్లేఆఫ్స్ అవ‌కాశాల‌ను సంక్లిష్టంగా మార్చుకుంది. సీజన్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన పంజాబ్, ప్రస్తుతం వరుసగా నాలుగు ఓటములతో సతమతమవుతోంది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు మ్యాచ్‌లలోనూ పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. పంజాబ్ ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది.

ప్రస్తుతం 11 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించి, నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. మొత్తం 13 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడినా పంజాబ్ నెట్ రన్‌రేట్ +0.428గానే ఉండటం విశేషం. పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇంకో నాలుగు పాయింట్లు కావాల్సి ఉంది. అంటే రెండు మ్యాచ్‌లలో త‌ప్ప‌క విజయం సాధించాలి.

పంజాబ్ కింగ్స్ తన మూడు మ్యాచ్‌లను ముంబై, ఆర్సీబీ, లక్నోతో తలపడనుంది. మే 14న ముంబై ఇండియన్స్, మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మే 23న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. ఇందులో ముంబై, లక్నో ఇప్పటికే ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ కాగా, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. దాంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే ఆల్‌రౌండ్ షో చేయాల్సిందే.

Leave a Reply