Peddapalli | రజినీని గెలిపించండి.. మీ బాధ్యత నాదే..

Peddapalli | రజినీని గెలిపించండి.. మీ బాధ్యత నాదే..
Peddapalli | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో 29వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఇల్లందుల రజనీని గెలిపిస్తే మీ వార్డు అభివృద్ధి బాధ్యత నేనే తీసుకుంటానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలియజేశారు. మున్సిపల్ ప్రచారంలో భాగంగా 29వ వార్డులో ప్రచారం నిర్వహించి చేయి గుర్తుకు ఓటు వేసి ఇల్లందుల రజినీని గెలిపించాలని అభ్యర్థించారు.
అనంతరం మాట్లాడుతూ.. రెండేళ్లుగా పట్టణాభివృద్ధే ద్యేయంగా పని చేస్తున్నామని, కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వార్డు పరిధిలో మట్టి రోడ్లు లేకుండా పూర్తిగా సీసీ రోడ్లు నిర్మిస్తామని అవసరమున్న ప్రతి చోటా డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణమూర్తి కుటుంబం గత పదేళ్లుగా కౌన్సిలర్ గా ఉన్న ఒక్కరి నుండి నయా పైసా తీసుకోలేదని అటువంటి నిజాయితీపరులను గెలిపిస్తే వార్డు అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందుల కృష్ణమూర్తి, ఫిరోజ్ సత్యనారాయణ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
