గీట్ల ముకుంద రెడ్డి సేవలు మరువలేనివి

గీట్ల ముకుంద రెడ్డి సేవలు మరువలేనివి
- ప్రభుత్వ విప్ విజయ రమణారావు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : స్వర్గీయ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుంద రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా కునారం రోడ్డులోని ముకుంద రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి విజయ రమణారావు నివాళులర్పించారు.
గీట్ల ముకుంద రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్లు నూగిల్ల మల్లయ్య, బిరుదు కృష్ణ, మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప, ప్రకాష్ రావు, గీట్ల రాజేందర్ రెడ్డి, గోపగాని సారయ్య గౌడ్, దండ నరసింహ రెడ్డి, ఉప్పు రాజు, మాదిరెడ్డి నరసింహ రెడ్డి, భూషణవెన సురేష్ గౌడ్, యాట మల్లారెడ్డి, మస్రత్, మంథని నర్సింగ్, అమ్రెష్, కౌన్సులర్లు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గీట్ల అభిమానులు పాల్గొన్నారు.
