జలమయం అయిన రహదారులు.. ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
జలమయం అయిన రహదారులు.. ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
పాయకాపురం, ఆంధ్రప్రభ: గత రాత్రి కురిసిన అకాల వర్షానికి పాయకాపురం పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు రహదారులపై, ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా రాజీవ్ నగర్, వడ్డెర కాలనీ, లాల్ బహదూర్ శాస్త్రి నగర్, సుందరయ్య నగర్, కండ్రిక, ఆర్.ఆర్ పేట, శాంతి నగర్ కొంత భాగం, వాంబే కాలనీ ప్రాంతాల్లోని పలు రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. వడ్డెర కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రైనేజీ కాల్వలు పొంగిపొర్లడంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అదేవిధంగా నున్న–నూజివీడు రహదారిలో చిన్న అమెరికన్ హాస్పిటల్ సమీపంలో రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
