హనుమాన్‌పేటలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు

ఆంధ్రప్రభ, విజయవాడ ; తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరంలోని హనుమాన్‌పేట లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్నా) కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. పార్టీ సిద్ధాంతాలను కాపాడుతూ, ప్రజాసేవలో ముందుండాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పొన్నం రవికుమార్, వెల్లంకి సుధాకర్, ఈడుపుగంటి అనిల్, బండారుపల్లి అనిల్, చౌదరి తదితరులు పాల్గొన్నారు.