Khammam| రూ.కోటికి పైగా విలువైన సెల్‌ఫోన్లు మాయం
Khammam| రూ.కోటికి పైగా విలువైన సెల్‌ఫోన్లు మాయం
Khammam| ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఖమ్మం నగరంలో భారీ చోరీ జరిగింది. జడ్పీ కార్యాలయం సమీపంలోని సోనోవిజన్ మొబైల్ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన చోరులు రూ.కోటికి పైగా విలువైన వందకు పైగా సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
గురువారం ఉదయం దుకాణానికి వచ్చిన యజమాని చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల కోసం గాలిస్తున్నారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
