Welfare Secretary | గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి

Welfare Secretary | గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి

Welfare Secretary |భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలోని పాతబస్తీ హిందూ హైస్కూల్(Hindu High School) రోడ్డు జెండా చెట్టు వీధిలోని సచివాలయంలో పని చేస్తున్న విశ్వనాథ్ (45) గుండె పోటుతో మృతి చెందారు. ఈ రోజు ఉదయం విధులకు సిద్ధం అవుతూ కార్డియాక్ అరెస్టుకు గురైన విశ్వనాధ్(Vishwanath) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

వార్డు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ(Welfare Secretary)గా పని చేస్తున్న విశ్వనాథ్.. పని భారం, విధి నిర్వహణలో ఒత్తిడి కారణంగా మృతి చెందినట్టు సహోద్యోగులు చెబుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. పని ఒత్తిడితో మృతి చెందినట్టు ఆరోపిస్తున్న సహోద్యోగులు, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply