Resignation | రాజ్యసభ ఎంపీ రాజీనామా..
Resignation | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల అనంతరం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో టీఎంసీ రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ చిక్ బారైక్ గురువారం తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఒకే వారంలో టీఎంసీకి చెందిన మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వరుస రాజీనామాలతో పార్టీలో అసమ్మతి స్వరాలు బలపడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజీనామాకు గల కారణాలపై అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది. అయితే ఎన్నికల తర్వాత పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
